చిరంజీవి కొత్తల్లుడిపై మరిన్ని కేసులు?
చిరంజీవి రెండో కుమార్తెను సినీఫక్కీలో రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్న శిరీష్ భరద్వాజ్ గత నేర చరిత్రలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. పదిహేడేళ్ళ వయసులోనే సంపన్న కుటుంబానికి చెందిన పదిహేనేళ్ళ బాలికను ప్రేమ పేరిట మభ్యపెట్టి 2002 సంవత్సరంలో కిడ్నాప్ చేసి, పెళ్ళి చేసుకున్న భరద్వాజ్ పై కేసు రుజువైంది. ఆ సమయంలో అతను మైనర్ అయినందువల్ల జువెనైల్ హోం (బాల నేరస్తుల జైలు)లో కొన్నాళ్ళు ఉండివచ్చాడు.
మల్కాజ్ గిరిలో శిరిష్ భరద్వాజ్ పై దాడి కేసు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఇతనిపై ర్యాగింగ్ కేసు ఉన్నట్టు తెలుస్తోంది. బేగంపేటలో కూడా కిడ్నాప్ కేసు ఉందని కొందరు చెబుతున్నా పోలీసులు స్పష్టం చేయడం లేదు. ఎస్ ఆర్ నగర్ పోలీసులు కూడా కిడ్నాప్ విషయాన్ని కొన్ని గంటల సేపు దాచి పెట్టారు.












Click it and Unblock the Notifications