చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించరు?
ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని, అలా ఇస్తే కరెంట్ తీగల్లో విద్యుత్ ప్రవహించదని, ఆ తీగలు బట్టలు ఆరేసుకోడానికీ తప్ప పనికి రావని అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గంభీరంగా చెప్పారు. ఆ పవర్ ఇష్యూ కూడా ఆయన పవర్ పోవడానికి ఒక కారణమైంది.
చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాము అధికారంలోకీ వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు. ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు ఇలా మాట్లాడుతారు? ఆయనను ఈ విషయంలో తెలుగుదేశం బీట్ రిపోర్టర్లు గట్టిగా నిలదీయలేకపోయారు. బీట్ రిపోర్టర్లు బీట్ కానిస్టేబుళ్ళుగా మారిపోవడం వల్లనే ఈ పరిస్ధితులు ఏర్పడుతున్నాయి.
చంద్రబాబునేకాదు, సిఎం బీటును, సిఎల్పీ బీట్ ను కవర్ చేసే విలేకరులు నిస్పాక్షింగా వ్యవహరించాల్సిన అవసరముంది. లేకపోతే ప్రజాస్వామ్యపు నాలుగో స్ధంభం కూలిపోయే ప్రమాదముంది.












Click it and Unblock the Notifications
