ఇదీ కూడా బాబు ప్లానా?

కానీ చంద్రబాబు నాయుడే బాలకృష్ణతో ఆ విధమైన ప్రకటన చేయించారని, బాలయ్య గ్లామర్ కు తోడు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధి అంటే జనం తెలుగుదేశం పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తారని ఆశించి చంద్రబాబే బాలయ్యతో ఇటువంటి ప్రకటన చేయించి ఉండవచ్చని సీనియర్ తెలుగుదేశం నాయకుడొకరు అన్నారు. తన పేరు రాయకుండా ఈ అభిప్రాయాన్ని ప్రచురించుకోవచ్చని ఆయన తెలిపారు.
"పదవికి నేను అలంకారం కానీ, నాకు పదవి అలంకారం కాదు" అని బాలకృష్ణ నిన్న అదే సందర్భంలో వ్యాఖ్యానించడం విశేషం. "పార్టీ ఆదేశిస్తే అక్క పురందేశ్వరి మీద కూడా పోటీ చేస్తా" అన్న బాలయ్య వ్యాఖ్య చంద్రబాబుదేనని ఆ నాయకుడు చెప్పారు. అటువంటప్పుడు బాలయ్య చేసిన మరో వ్యాఖ్య కూడా చంద్రబాబుది కాకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
