చిరంజీవి కాపు మాత్రమేనా?

చిరంజీవి అంటే కాపు అన్న ఆలోచనతో అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదపాలనుకోవడం అవివేకం. చిరంజీవికి ఇతర అగ్ర వర్ణాల్లో అభిమానులు తక్కువగా ఉండవచ్చు కానీ ఆయనకు రాష్ట్ర జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న బిసి, ఎస్ సిలలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక 20 శాతానికి పైగా ఉన్న కాపు ఉపకులాలైన బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపుల ఓట్లు ఆయనకు అత్యధికంగా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ, మండలి బుద్ధప్రసాద్, సామినేని ఉదయభాను వంటి బలమైన కాపు నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి ఉడిగిపోయిన కాపు నాయకులు తప్ప సరైన నాయకులు, కులాన్ని తమ వెంట నడిపించుకోగల నేతలు లేకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications