చిరంజీవి స్నేహాలు, ఆత్మీయతలు

అయితే చిరంజీవిలో ఆయనకే అర్ధం కాని మైనస్ పాయింట్లు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మద్రాసులో సినిమా వేషాల కోసం ఎదురుచూస్తూ ఒక చిన్న రూమ్ లో హరిప్రసాద్, సుధాకర్ లతో పాటు ఉన్న చిరంజీవి స్టార్ డం వచ్చాక వారిద్దరినీ దూరం పెట్టారని విమర్శలు ఉన్నాయి. చిరంజీవికి వారెంటే ఎంతో ప్రేమ ఉన్నా అల్లు అరవింద్ వారిని చిరంజీవికి దూరం చేశారనే ఆరోపణలున్నాయి. చిరంజీవి పార్టీ ప్రకటన చేసిన రోజునే హరిప్రసాద్ హఠాత్తుగా మరణించడం కాకతాళీయం కావచ్చు. స్నేహానికి, డబ్బుకి మధ్య ఎన్ని అవాంతరాలు ఉంటాయో దీనిని బట్టి ఆలోచించుకోవచ్చు.












Click it and Unblock the Notifications