చిరు ప్రకటన, భారీ తప్పిదం

Chiranjeevi
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు చిరంజీవి మంచి ర్యాంకే సంపాదించే అవకాశముంది. ఆయన రోడ్ షోలకు యువకులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఆకర్షితులవుతున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలకు చిరంజీవి ప్రజాపార్టీ ఆందోళన కలిగిస్తోంది. అయితే చిరంజీవి నిన్న బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశమున్నట్టు హింట్ ఇవ్వడంతో ఆయన రాజకీయ అపరిపక్వత తేటతెల్లమైంది. చిరంజీవి బిజెపికి దూరంగా ఉంటారని భావించి ఆయనకు చేరువైన వామపక్షాలు ఈ దెబ్బకు ఖంగు తిన్నాయి. వెంటనే కొన్ని గంటల్లోనే చిరంజీవి తన మాటలను వెనక్కి తీసుకుని, తమ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని ప్రకటించవలసి వచ్చింది.

ఇది చిన్న అపశృతే. కానీ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కాదలచుకుని, అవినీతిని నిర్మూలిస్తానని ప్రకటిస్తున్న చిరంజీవి ఇంత ముఖ్యమైన విషయంలో ఇలా ప్రకటన చేసి అలా వెనక్కి తీసు కోవడం దారుణం. చిరంజీవి రాజకీయ నాయకుడిగా రాణించలేరన్న సంకేతాలు ఇటువంటి సందిగ్ధాల వల్ల బయటపడుతున్నాయి. చిరంజీవికి కుడి అవయవంగా బిజెపి మాజీ నాయకుడు పరకాల ప్రభాకర్, ఎడమ అవయంగా లెఫ్ట్ ముద్ర ఉన్న డాక్టర్ మిత్రా వ్యవహరిస్తున్నారు. దానితో చిరంజీవి లెఫ్టో రైటో తేల్చుకోలేక కొట్టు మిట్టాడుతున్నారు. ఆయన పలికేవి చిలక పలుకులు కావన్న అభిప్రాయం ప్రజల్లో కలగాలంటే చిరంజీవి తన సొంత అభిప్రాయాలను ప్రకటించుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+