సినిమా వాళ్ళకి పండగే పండగ

వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎక్కువగా సినిమా పరిమళం కోసం పరితపిస్తోంది. నటులైతే చాలు, ముసలీ ముతకా అయినా ఫర్వాలేదన్నట్టు ఆ పార్టీ వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హీరో కృష్ణకు ఒక ఫేవర్, జీవిత-రాజశేఖర్ దంపతులకు మరో ఫేవర్, జయసుధకో హామీ, ఎస్వీ కృష్ణారెడ్డికి మరో హామీ ఇచ్చి వారితో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, వైఎస్ కు అత్యంత సన్నిహితుడు కెవిపి రామచంద్రరావు గ్రూపు ఫోటోలు దిగి సామాన్య ప్రజలకు ఎనలేని వినోదాన్ని పంచారు.
సిద్ధాంత బలం, ఒక నిర్ధిష్ట గమ్యం ఉన్న టీఅర్ ఎస్ కు సినిమా గ్లామర్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. దేవేందర్ గౌడ్ పార్టీకి మాత్రం సినిమా గ్లామర్ అవసరం కావచ్చు. ఒకనాటి విలన్ కాంతారావు దేవేందర్ గౌడ్ పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశాలున్నాయి. కానీ తగిన పారితోషికం అందిన తర్వాతే. ఏమైనా ముడితే తాము ఏ పార్టీ తరఫున ప్రచారం చేయడానికైనా సిద్ధమని అంటున్నారు ఫిల్మ్ నగర్, మోతీనగర్ లలో ఉంటున్న వృద్ధ నటీనటులు. భేష్. నటన వృత్త్తి కాబట్టి కథ ఎలా ఉన్నా సర్దుకుపోవాలి మరి.












Click it and Unblock the Notifications