జయలలిత ఆ టైపా? కరుణానిధి వ్యాఖ్యలు!

Karunanidhi
తమిళనాడులో కరుణానిధి, జయలలితల మధ్య పరోక్ష మాటల యుద్ధం క్లెయిమాక్స్ కు చేరుకుంది. తమిళనాడు రాజకీయాల్లో ఒకసారి డిఎంకె అధికారంలోకి వస్తే, మరోసారి ఏఐడిఎంకె రాజ్యం చేయడం మామూలే. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యర్ధి మీద కక్ష సాధించుకోవడం కూడా మామూలే.

వచ్చే తమిళనాడు ఎన్నికల్లో జయలిలత విజయం సాధిస్తుందని ఆమెకు అనుకూలంగా ఉండే మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది. కానీ కరుణానిధికి అనుకూలంగా ఉండే మీడియా జయలలిత మీద వ్యంగ్య బాణాలు సంధిస్తోంది. జయలలిత అధికారంలోకి రాగానే కరుణానిధి ఇంటి మీదికి పోలీసు అధికారులను పంపడం, ఆయనను కింద ప డేసి లాఠీచార్జి చేయించడం, ఆ వీడియో క్లిప్ బయటికి రావడం తెలిసిందే. అలాగే కరుణానిధి అధికారంలోకి వచ్చినప్పుడు జయలలితను అరెస్టు చేసి, చిన్న లాకప్ లే వేయడం కూడా తెలిసిందే.

ఇప్పుడు జయలలితను అధికారంలోకి రాకుండా చేయడానికి కరుణానిధి కోటరీ అనేక అడ్డదారులను అన్వేషిస్తోంది. జయలలిత- శోభన్ బాబు ప్రేమాయణాన్ని బయటికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయలలిత-శశికళల మధ్య ఉన్నట్టు ఆరోపణలు ఉన్న స్వలింగ సంపర్కాన్ని కూడా ప్రజల మనసుల్లో నాటుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కరుణానిధి జయలలిత మీద " ఆమె ఎంతో పవిత్రురాలు, ఉన్నతులు, గొప్పవారు, పూజనీయులు" అని వ్యంగ్య బాణాలు వేశారు. ఆమె అపవిత్రురాలు అన్నది ఆయన ఉద్దేశమని తమిళ ప్రజలు ఇట్టే గ్రహించారు. అయినా జయలలితకు అరవై దాటాయి. కరుణానిధికి ఎన భై దాటాయి. ఈ దశలో ఇద్దరూ ఎంతో హుందాగా ప్రవర్తించడం అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+