సిని'మా'లో 'దేశం'

వాస్తవానికి చిరంజీవి ప్రజారాజ్యం కి సపోర్టు ఇస్తున్న వారి మద్దతుతో నిలబడ్డ అభ్యర్ది విజయ్ చందర్. అలాగే తెలుగు దేశం సపోర్టు చేసే వర్గం తరుఫున మురళిమోహన్ నిలబడ్డ అభ్యర్ధి. అయితే మురళీమోహన్ తన ప్రత్యర్ధి విజయ్ చందర్ పై 108 ఓట్ల తేడాతో గెలుపొందారు. మురళీమోహన్ 400 ఓట్లకు గానూ 244 పొందగా విజయ్ చందర్ కేవలం 116 మాత్రమే పొందారు. అలాగే మురళీ మోహన్ ప్యానల్ నుండి నిలబడ్డ ఆహుతి ప్రసాద్ చిరంజీవి ప్యానెల్ నుండి వచ్చిన అయ్యప్ప పి.శర్మ పై 141 ఓట్ల తేడాతో ఓడించి జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యారు. ఇక ఇంతకు ముందే అల్లుఅరవింద్ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకి చివరి నిముషంలో విరమించుకుని కె.ఎస్ .రామారావు కి పట్టం కట్టారు. విశ్లేషకుల అంచనా ప్రకారం చిరంజీవి వ్యతిరేకులంతా మురళీ మోహన్ కి ఓటు వేశారని అందుకే అంత మెజారిటీ సాధించారని తెలుస్తోంది. కొంతలో కొంత కాంగ్రెస్ పాగా వేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసుకు మద్దతిస్తారని చెబుతున్న జయసుధ కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
దాంతో చిత్ర పరిశ్రమ తెలుగు దేశం పార్టీకి పూర్తి సపోర్టు ఇస్తోంది అనేదాని కన్నా చిరంజీవి వ్యతిరేక వర్గంగా పనిచేస్తోందనేది రుజువయింది అని కొందరు అంటున్నారు.ఇక మురళీమోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రా,తమిళనాడు,యు.స్ అన్న తేడా లేకుండా అంతటా మూవీ ఆర్టిస్ట్ గతంలో తమ సత్తా చూపారు. అలాగే మా లో రకరకాల పార్టీలకు చెందిన వారు ఉన్నా సినీ ప్రపంచంలో అంతా ఒకటే కలసే ఉంటాం. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు మన శక్తి (పవర్) ఎంతంటుంది అని ప్రశ్నిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు రెచ్చకొడితే మనం అంతా కలసి మన సత్తా మళ్ళీ చూపుతాం అని ఇండైరక్ట్ గా కాంగ్రెసుకు చురకలు అంటించారు. ఇక ఈ కార్యవర్గం రెండేళ్ళ పాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు మా అధ్యక్షుడిగా పనిచేసిన చిరంజీవి సోదరుడు నాగబాబు మాట్లాడుతూ సంఘ అధ్యక్షుడుగా కొన్ని అనుకున్న కార్యక్రమాలు చేయలేక పోయాం. ఇబ్బందులు జరిగి ఉంటే క్షమించవలసిందన్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన నేపథ్యంలో నాగబాబు ప్యానెల్ కు మద్దతు తగ్గిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే అక్కినేని నాగేశ్వరరావు మాత్రం చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టడాన్ని సమర్థిస్తూ కాంగ్రెసును పరోక్షంగా విమర్శించారు. ఏమైనా తెలుగుదేశం పార్టీ మద్దతు దారుల చేతుల్లోకి మా వెళ్లిపోయిందనే గుసగుసలు టాలీవుడ్ లో జోరందుకున్నాయి.












Click it and Unblock the Notifications