నగ్మా కూడా క్రిస్టియన్ మతంలోకి?

తెలుగు, తమిళ సినిమాల్లో ఒకనాడు అగ్ర హీరోయిన్ గా వెలిగిన నగ్మా ఇప్పుడు భోజ్ పురి చిత్రాలకు పరిమితమైంది. చక చకా వ్యూహాలను మార్చుకుని, కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఆమె ప్రత్యేకత. ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆమె ఈ మధ్య క్రిస్టియన్ మతంపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. చెన్నై లో గత ఆదివారం విజయ్ పార్క్ హోటల్ లో జరిగిన క్రిస్టియన్ గాస్పెల్ మీటింగ్ కు నగ్మా హాజరైనట్టు తెలుస్తోంది. నిజానికి నగ్మాను గొప్ప సెక్యులర్ వ్యక్తిగా పరిగణించవచ్చు. ఒకనాటి బాయ్ ఫ్రెండ్ సౌరబ్ గంగూలీతో శ్రీకాళహస్తి దేవాలయంలో పూజలు చేస్తూ ఆమె మీడీయాకు చిక్కింది. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ లింవింగ్ లో ఆమె చేరింది. ఇలా అన్ని మతాలను, అన్ని విశ్వాసాలను అనుసరిస్తున్న నగ్మాను అభినందించి తీరాలి.ఈ మధ్య తరచు క్రైస్తవ మత సమావేశాల్లో పాల్గొంటున్న ఆమె ఇటువంటి ఒక సమావేశంలో గంటకు పైగా ఉద్వేగభరితంగా ప్రసంగించినట్టు సమాచారం. రాజకీయాల్లో చేరిన తర్వాత తాను మానసికంగా కుంగిపోయానని, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నగ్మా ఈ సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications
