అఫీషియల్ గా పవన్ కళ్యాణం?

ఇక పవన్- నందినిలకు 1997 మార్చిలో పెళ్ళి జరిగింది. కొద్ది కాలానికే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దానికి సంబంధించిన ఆధారాలతో నందిని కోర్టుకు వెళ్లింది. ఈ కేసు చాలాకాలంగా న్యాయస్ధానంలో విచారణలో ఉంది.ఈ కేసుల్లో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవితో పాటు మరో 12 మందిని ఆమె ప్రతివాదులుగా పేర్కొన్నారు.కొంతకాలం న్యాయస్ధానాల్లో విచారణలు జరిగిన తర్వాత తనకు 8 కోట్ల పరిహారం ఇవ్వాలని నందిని డిమాండ్ చేసింది. ఇరువైపులా ఉన్న న్యాయవాదులు 5 కోట్లకు కోర్టు వెలుపల పరిష్కారానికి రాజీ కుదిర్చినట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా పెద్దల సమక్షంలో పెళ్ళి జరిగితే ఏ ప్లాబ్లం ఉండదని చెప్పారని నిర్ణయించారుట. అయితే ఇప్పటికే అకిరా (కుమారుడు) ఉండటంతో వివాహం ఘనంగా చేసుకుంటే బాగుండదని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి తమ కుటుంబం వస్తున్న ఈ సమయంలో అంతా క్లీన్ చిట్ తో ఉండటం మేలని శ్రేయోభిలాషులు చిరంజీవికి సూచించటమే దీనికి కారణమని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications