వర్మ ... నాగార్జున చెంచా

నా వీడియా షాప్ బిజినెస్
అప్పట్లో నేను అమీర్ పేటలో మూవీ హౌస్ అనే వీడియో షాపు నడిపేవాడిని. అక్కడికి వచ్చిన కష్టమర్స్ కి నా దగ్గరున్న ప్రతీ సినిమా లోని కథ నేరేట్ చేసావాడినని. దాంతో వారి టేస్ట్ ని బట్టి ఆ సినిమాలు తీసుకెళ్ళేవారు. ఆ సమయంలో నేను కథ చెప్పే విధానం చూసి చాలా మంది ముచ్చటపడేవారు. కొంతమందిఅయితే నా నేరేషన్ సినిమా కన్నా చాలా బాగుందని మెచ్చుకునేవారు. అలా నేను దాదాపు ఎనిమిది నెలలు పాటు అధ్భుతమైన వ్యాపారం చేసి సంపాదించాను. అప్పట్లోనే అమితాబా ఆఖరీ రాస్తా సినిమా పైరేట్ చేయటంతో పోలీసు లాకప్ చూడాల్సివచ్చింది.
'శివ' పుట్టిన క్షణం...
అప్పుడు మా నాన్న గారు వేరే వారితో మాట్లాడుతూ అక్కినేని వెంకట్ ...నాగార్జున హీరోగా సినిమా కథ కోసం వెతుకుతున్నారని చెప్పటం విన్నాను. అయితే ఆ సినిమా డైరక్ట్ చేయబోయేది కె.రాఘవేంద్రరావు. యార్లగడ్డ సురేంద్ర(నాగ్ బావ) మా కష్టమర్. దాంతో ఆయన్ని పట్టుకుని రాత్రి కథ వినిపించాను. అయితే ఆయన వెంటనే ఈ కథ తెలుగుకి వర్కవుట్ కాదని,కథ హీరోకి సంభందించింది అయితేనే రాఘవేంద్రరావుగారి దగ్గరికి నిర్మొహమాటంగా చెప్పేసారు. దాంతో ఒక గంట తీసుకుని శివ సింగిల్ లైన్ ఆర్డర్ అనుకుని వినిపించాను. ఆ కథలో నా కాలేజ్ డేస్,గోవిందనిహలాని అర్ధ సత్య,రాహుల్ రవైల్ అర్జున్, దిలీప్ శంకర్ కాలచక్ర సినిమాలు కలిపి వండాను.
రాఘవేంద్రరావు రిజెక్ట్
ఈసారి సురేంద్ర కి నా కథ నచ్చింది. అక్కడినుండి వెంకట్ ని కలవటం అతను రాఘవేంద్రరావు దగ్గరికి తీసుకెళ్ళటం జరిగిపోయాయి. అయితే రాఘవేంద్రరావు ఈ సినిమా ప్రయోగమని డ్రామా లేదని రిజెక్ట్ చేసారు. అయితే అంత సక్సెస్ ఫుల్ దర్శకుడు అలా చెప్పటంతో నాలోనే లోపం ఉందని తిరిగి రీరైట్ చేయాలని అనుకున్నాను.సరిగ్గా అదే సమయంలో కలియుగ పాండవులు చూడటం జరిగింది. దాంతో నాకు సడెన్ గా రియలైజ్ అయింది. దాంతో కధా రచయితని కావాలనే ఆలోచన ప్రక్కన పెట్టి దర్శకుడు కావాలని నిర్ణయించుకొన్నాను.
అసెస్టెంట్ డైరక్టర్ గా..
అయితే దర్శకుడు అవ్వాలంటే అంతా ఎక్సపీరియన్స్ కావాలని అంటారు కాబట్టి ఎక్కడన్నా అసిస్టెంట్ గా ఉందామనుకున్నాను. అదే సురేంద్రకు చెప్పాను. అప్పుడు వాళ్ళు బి.గోపాల్ తో కలెక్టర్ గారబ్బాయి సినిమా ప్రారంభిస్తున్నారు. అందులో నాగార్జున,అక్కినేని కలసి నటిస్తున్నారు. నేను ఆ సినిమాకి ఐదవ అసెస్టెంట్ గా జాయిన్ అయ్యాను. అప్పట్లో బి.గోపాల్ చాలా బిజీగా ఉండేవారు .అందుకే నేను ఆ సినిమా స్క్రిప్టు వర్క్ కి అటెండ్ అయ్యాను. అక్కడికి నవలా రచయితలు కొమ్మనాపల్లి గణపతిరావు,సూర్యదేవర రామ్మోహన రావు సిట్టింగ్స్ కి వచ్చేవారు. ఆ డిస్కషన్స్ లో నేను కొన్ని ఐడియాలు విజువల్ గా చెప్పేవాడిని. కొద్ది రోజులకే సురేంద్ర నాకు పికప్ చేసుకోవటానికి కారు పంపించటం ప్రారంభించాడు. అయితే నేను ఐదవ అసెస్టింట్ అయ్యుండి నిర్మాతలతో సఖ్యంగా ఉండటం మిగతా వారికి నచ్చేది కాదు. అందులోనూ అసెస్టెంట్ డైరక్టర్స్ అంటే భలే చిన్నచూపు కదా. అయితే వారం రోజులకే నన్ను తీసేసారు. నేను క్లాప్ బోర్డ్ కొట్టడం,కంటిన్యూ చూడటం సరిగ్గా చేయకపోవటమే కారణం.
నాగ్ తో చనువు..
సురేంద్ర పిలిచి అబ్జర్వేషన్ మాత్రమే చేయమని చెప్పాడు. భాద్యతలు లేకపోవటంతో మెల్లింగా నాగార్జునతో పరిచయం మొదలయ్యంది. నా సినిమాటెక్ సెన్స్ కి ,నా నేరేషన్ స్కిల్స్ కి నాగార్జున ఇంప్రెస్ అయ్యారు. అయితే అప్పటికి నాగార్జునకి అంత నన్ను డైరక్టర్ గా రికెమెండ్ చేసేంత స్ట్రాంగ్ పొజీషన్ లేదు. అయితే ఈ లోగా నన్ను అంతా నాగార్జున చెంచా అని వరస్ట్ అసిస్టెంట్ డైరక్టర్ అని పిలవటం ప్రారంభించారు. నాకు భవిష్యత్ లేదని నాకు ఏటిట్యూడ్ ప్లాబ్లమ్ బాగా ఎక్కువని అంతా అనుకునేవారు.ఈ లోగా నా వీడియో షాపు ని నిర్లక్ష్యం చేయటంతో స్టాఫే నన్ను మోసం చేసారు. దాంతో ఇలా జరుగుతుందని మేమంతా మేం చెప్తూనే ఉన్నాం కదా అని విమర్శించటం, లెక్చర్స్ ఇవ్వటం ప్రారంభించారు. అప్పుడు హఠాత్తుగా ఓ రోజు శివ ఓ.కె అయింది. అంతే..












Click it and Unblock the Notifications