బాబు, వైఎస్ మధ్య 'అవగాహన'?

రోజుకి కోటో, అరకోటో నష్టం వస్తున్న పత్రికను పోషించడం దీర్ఘకాలంలో కష్టమే. కనీసం ఎన్నికల వరకు పత్రికను లాగాలంటే ఇంకా కొందరు ప్రత్యర్ధి నాయకులను బజారుకు ఈడ్వక తప్పదు. ఈ పత్రిక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ జాబితాలో చంద్రబాబు నాయుడి అత్యంత సన్నిహితులు ఉంటారు. వీళ్ళు చంద్రబాబు నాయుడి మీద నేరుగా ఎందుకు పడరంటే అందుకు కారణాలు వేరే ఉన్నాయి. ఒక వేళ చంద్రబాబు నాయుడు వైఎస్ ఆస్ధుల పూర్తి వివరాలు బయటపెట్టగలిగితే, వైఎస్ కూడా చంద్రబాబు నాయుడి ఆస్ధుల చిట్టా బయట పెట్టగలరు. తమిళ నాడు రాజకీయాల తరహాలో ఇక్కడెందుకు నిజాలు ప్రత్యర్ధుల నోటి నుంచి బయటికి రావడం లేదు. ఒకరు అధికారంలోకి వస్తే మరోకరిని జైలుకు పంపే పరిస్ధితులు ఎందుకు రావడం లేదు? ప్రజలకు నిజాలు తెలుసుకునే అవకాశం ఎందుకు రావడం లేదు? బాబు, వైఎస్ దొందూ దొందే అయితే? వారిద్దరి మధ్య రహస్య అవగాహన ఉంటే? జనం ఫూల్సే కదా?












Click it and Unblock the Notifications
