శివాజి రిలీజయినప్పటి నుంచి హీరోయిన్ శ్రియ విచిత్రంగా బిహేవ్ చేస్తోంది. రోజుకో కొత్త కండీషన్ కలిపిన ప్యాకేజీతో రెడీ అవుతోంది. సినిమా ఒప్పుకునేటప్పుడు ఎన్ని రోజులు కాల్షీట్స్ ఇచ్చామో అంతకు మించి ఒక్క రోజు ఎగస్ట్రాగా సెట్స్ కి రావాలన్నా రోజుకు అరవై వేల రూపాయల చొప్పున చెల్లిచాలంటోంది. డిమాండు ఉన్నప్పుడే రూపాయి సంపాదించాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన మంచిదే కాని మరీ ఇంతలా అయితే మా పని ఇంతే అంటున్నారు నిర్మాతలు. కరక్టే గాని రెమ్యునేషన్ పెంచమంటే పైకీ క్రిందకీ చూస్తారు..వీళ్ళకి మాత్రం ఫ్రీ గా పని చేయాలా అని రిటార్టు ఇస్తోంది శ్రియ. కాని డైరక్టుగా నిర్మాతలూ నిలదీయరు. ఆమె అంతలా సమాధానం చెప్పదు. ఆమె మేనేజరు ఇవన్నీ లోపాయికారిగా చేస్తుంటాడు. సినిమా కొంత అయ్యాక ఏ కారణం తో లేటయ్యనా ఇలాంటి ఎన్ని డిమాండ్లు అయినా భరించక తప్పదు అంటున్నారు ఆల్రెడీ దెబ్బతిన్న నిర్మాతలు. అయినా హీరోయిన్ల క్రేజ్ ని, అందాలను మార్కెట్ చేసుకుందామనుకునే వాళ్ళకు ఇవి తప్పవు అంటున్నారు తల పండిన వాళ్ళు. చేసుకున్నవారికి చేసుకున్న మహదేవా అని ఊరికే అన్నారా, శ్రియాను సినిమాలో పెట్టుకున్నందుకు ఈ తంటాలు తప్పవు కదా.