వైఎస్ కు పొంచి ఉన్న డిఎస్ ముప్పు!

ఈ నేపధ్యంలో వైఎస్ సొంత మనుషులను కాకుండా సొంత వ్యక్తిత్వంతో ముందుకు సాగుతున్న డి శ్రీనివాస్ ను మేడం సోనియా పిసిసి అధ్యక్షుడిగా నియమించింది. శ్రీనివాస్ కు హై కమాండ్ నుంచి తరచు కమాండ్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ కు పక్కలో బల్లెంలా ఉండ మని డిఎస్ కు సంకేతాలు అందినట్టు కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే వైఎస్స్సే ముఖ్యమంత్రి అవుతారని డి శ్రీనివాస్ నిన్న చిలక పలుకులు పలికినప్పటికీ, ఆయన అంతరంగం వేరు. శ్రీనివాస్ కాంగ్రెస్ అధిష్టానవర్గానికి వీర విధేయుడు. వైఎస్ అలా కాదు. వీరిద్దరిలో హై కమాండ్ ఎవరిని విశ్వాసంలోకి తీసుకుంటుందో ఎవరైనా సులభంగా ఊహించవచ్చు.












Click it and Unblock the Notifications