మీడియా వాచ్: ఈనాడు-జ్యోతి-సాక్షి

YS Rajasekhar Reddy
చిరంజీవి సభలకు జనం తగ్గుముఖం పట్టినా ఆ రెండు పత్రికలు మాత్రం "చిరు ఇరగదీశాడు" అన్నట్టు రాస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డిని గద్దె దించడానికి చిరంజీవి "చిరు" పాత్ర అయినా వహించగలడని ఆ పత్రికల ఆశ కావచ్చు. చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీపై ఆ రెండు పత్రికలు నిర్వహించిన ప్రైవేటు సర్వేలలో ఆశాజనక ఫలితాలు రానప్పటికీ వైఎస్ కు మనస్ధాపం కలిగించే ఉద్దేశంతోనే ఆ పత్రికలు వార్తా కథనాలను ప్రచురిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ప్రైవేటుగా రుస రుస లాడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి "ఆంధ్రజ్యోతి" మీద ఆక్రోశం వ్యక్తం చేయడం ఈ యుద్ధానికి పరాకాష్ట. తన మీద ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఆధార రహిత కథనాలు చదివి కలత చెందిన తన తల్లి గుండెపోటుతో మరణించిందని ఆయన చెప్పినట్టు వైఎస్ పత్రిక "సాక్షి"లో నేడు పతాక శీర్షికతో వార్త వచ్చింది. ఆ వార్త ఇతర పత్రికల్లో రాకపోవడం గమనించాల్సిన విషయం. ఈ యుద్ధంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక వైపున ఉండగా సాక్షి మరో వైపు ఉంది. "వార్త" గుంటకాడ నక్కలాగా ఎటు చేరాలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అయినా పత్రికలు చదివి ప్రభావితమై ఓట్లు వేసేవారుంటారా?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+