ప్రజారాజ్యానికి పెద్ద దెబ్బ

ప్రజారాజ్యం పార్టీకి ఒక సైద్ధాంతిక పునాది వేసిన ఆ నలుగురిలో పరకాల ఒకరు. సామాజిక న్యాయం అనే నినాదం ఆయనదే. ఆ నినాదాన్ని పట్టుకుని జనంలోకి వెళ్ళిన చిరంజీవి ఆ నినాద సృష్టికర్తను విస్మరించారు. ప్రభాకర్ కు పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. ప్రభాకర్ తన సొంత స్ధానమైన నర్సాపురం లోక్ సభ స్ధానం నుంచి టికెట్ ఆశించారు. ఆ టికెట్ ఆయనకు దక్కలేదు. ప్రజారాజ్యం టికెట్లను అల్లు అరవింద్ అమ్ముకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వాటిని నేరుగా ధృవీకరించకపోయినా పరకాల ప్రభాకర్ ఆ పార్టీ ఒక విష వృక్షంగా మారిందని ఆరోపించారు. చిరంజీవి ఇంకా సినిమా ఫక్కీలో వ్యవహరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. రాజకీయాలను కూడా సినిమా నిర్మాణంలా మార్చారని, అల్లు అరవింద్ నిర్మాతలా వ్యవహరిస్తూ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications