హైకమాండ్ కు జగన్ చిట్టా

గాలి జనార్ధనరెడ్డితో కలిసి జగన్ అనేక వ్యాపారాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. కర్ణాటక బిజెపి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సహాయంతో బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో జగన్ వెయ్యి ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం మూడు వేల కోట్లు కాగా వచ్చే ఐదేళ్ళలో ఆ విలువ పది వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఒక దశలో జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అధిష్టానవర్గం సిద్ధపడినా ఆ తర్వాత ఈ ఆరోపణల మీద ప్రాధమిక నివేదిక పొందిన అనంతరం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అధికారం దన్ను లేకుండా జగన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడపగలరా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications