మోసపోయిన దాసరి!

ఇటీవల దాసరి సన్నిహితుడే ఆయనను దారుణంగా మోసగించాడని తెలుస్తోంది. దాసరికి రావలసిన పెద్ద మొత్తాన్ని వసూలు చేసుకుని అతను మొహం చాటేస్తున్నట్టు సమాచారం. దాసరి పంపించారంటూ ఢిల్లీ వెళ్ళిన ఆ వ్యక్తి, దాసరి ముందస్తుగా చేసిన సంతకాలున్న కాగితాలను ఇచ్చి కోట్లలో మొత్తాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చి దాసరికి కన్పించకుండా జంప్ జిలానీ అయ్యాడని చెబుతున్నారు. దాసరి ఢిల్లీలి ఫోన్ చేయగా, ఆ డబ్బును మీ మనిషికి ఇచ్చామని వారు చెప్పారట. తన మనిషిని పిలిపించి దాసరి మందలించగా" అవును, నాకు అవసరమైంది, వాడుకున్నాను, డబ్బు వచ్చినప్పుడు ఇస్తాను" అని తాపీగా చెప్పడంతో సినిమా ఫక్కీలో షాక్ తినడం దాసరి వంతు అయింది.












Click it and Unblock the Notifications