దూకుడు ధోరణిలో మళ్ళీ కెసిఆర్

మేధావులమని చెప్పుకునే కొందరు స్వార్థపరుల చర్యల వల్ల తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన సామాన్య ఆంధ్రా ప్రాంత వాసులు నష్టపోతారని ఆయన అన్నారు. ఇలాంటి స్వార్థపరులు కుట్రపూరిత చర్యల వల్ల ఆంధ్రాప్రాంతానికి చెందిన సామాన్యులు ఆక్రమించుకున్న భూములు, ఉద్యోగాలు వదులుకొని పోవాల్సి వస్తుందని కెసిఆర్ హెచ్చరించారు. లగడపాటి రాజగోపాల్ పై కేసీఆర్ మండి పడ్డారు. అనవసరంగా స్థానికులకు, స్థానికేతరులకు పుల్లలు పెడుతూ రాజగోపాల్ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని కేసీఆర్ అన్నారు. తాను తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఎన్ని శక్తులొచ్చినా ఆపలేవని, తాను ఒక సారి బలిపీఠమెక్కితే ఉత్పాతమేనని కేసీఆర్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications