జ'గన్' కు లొంగని హైకమాండ్!

లక్ష్మీపార్వతిది ఐరన్ లెగ్ అన్న అభిప్రాయం చాలా మందికి ఉంది. ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఆశలు కోల్పోని జగన్ ను ఆమె క్యాంప్ కార్యాలయంలో కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లక్ష్మీపార్వతి లెగ్ ఎఫెక్ట్ వల్ల ఆయనను ఆ పదవి రావడం మరింత ఆలస్యమవుతుందేమోనన్న జోక్స్ పేలుతున్నాయి. జగన్ ను కలుసుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
వైఎస్ విధేయులతో పాటు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న స్వార్ధపరులు కూడా జగన్ ఎదుట వీర విధేయత ఒలకబోస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రి రోశయ్యను కలుస్తున్నవారు వారు కూడా డబుల్ గేమ్ లో భాగంగా ఇక్కడ కూడా కన్పిస్తున్నారు. ఈ గోడ మీద పిల్లుల వ్యవహారంపై రోశయ్య నిఘా పెట్టించినట్టు సమాచారం. వట్టి వసంతకుమార్, కొండా సురేఖ, జయసుధ మాత్రమే జగన్ కు వీర విధేయులుగా కన్పిస్తున్నారు. ఇంకా చాలా మందికి జగన్ సిఎం కావాలన్న కోరిక ఉన్నా హై కమాండ్ కు భయపడి ఇప్పుడు నోరు మెదపడం లేదు.












Click it and Unblock the Notifications