వైఎస్ వేదాంత ధోరణి

YS Rajasekhar Reddy
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్నిరోజులుగా ముభావంగా ఉంటున్నారు. తన నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ స్ధానాలు తెచ్చుకోగలదన్న ధీమా ఎన్నికల సమయంలో కన్పించినా ఇప్పుడాయన వేదాంత ధోరణిలో పడిపోయారు. దేవుడు కరుణిస్తే గెలుస్తాం అన్నవిధంగా ఆయన వ్యవహార సరళి ఉంది. తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని ఆయన అనుకున్నారు. జనం మీద భరోసా పెట్టుకున్నారు. ఇంత చేసినా జనం ఆదరణ లభించకపోతే బాధ పడకూడదని మనసును మరో వ్యాపకం వైపు మళ్ళించుకోవాలని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మీడీయాకు, ముఖ్యంగా టీవీ చానళ్ళ దూరంగా ఆయన కడప జిల్లాలోని తన ఫాం హౌస్ లో ప్రకృతి అందాల మధ్య సేదదీరుతున్నారు. "కృషినే నమ్ముకో- ఫలితాన్ని ఆశించకు" అన్న భగవద్గీతా వాక్యాన్ని తలచుకుంటూ ఆయన రోజులు గడుపుతున్నారు-ఫలితాలు వచ్చే పదహారో తేదీ వరకు.

రాజకీయ నాయకులు అరవై ఏళ్ళకు రిటైరైతే బాగుంటుందని, తన మటుకు తాను అదే చేయబోతున్నానని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ ప్రకటించారు. ఇప్పుడాయనకు దాదాపు అరవై ఏళ్ళు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాక ఆయనలో ప్రజల పట్ల బాధ్యత బాగా పెరిగింది. ఇంకా మరికొన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అందువల్లనే కావచ్చు ఆయన గతంలో చేసిన రిటైర్మెంట్ ప్రకటనను మర్చిపోయారు. ఆయన లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేనట్టే అన్న పరిస్ధితి ఉండడం వల్ల కూడా ఆయన కన్నతల్లి వంటి పార్టీ సేవ కోసం రిటైర్మెంట్ ప్రతిపాదనను విరమించుకున్నారని అనుకోవాలి. పాజిటివ్ గా ఆలోచిస్తే అంతే మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+