స్టూడియో ఎన్ న్యూస్ చానల్ లో ప్రధాన వాటా తీసుకున్న లోకేష్ త్వరలో ఆ చానల్ లో మార్పులు చేర్పులు చేయనున్నాడు. చిన్నప్పుడు చంద్రబాబు లోకేష్ కు ఎన్ని వస్తువులు కొని ఇచ్చారో తెలియదు కానీ ఇప్పుడు ఏకంగా ఒక చానల్ నే కొని ఆనందపెట్టారు. డబ్బు విషయంలో చంద్రబాబు నాయుడి కంటే పిసినారి అయిన లోకేష్ ఉన్నంతలోనే డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికాలో ఎంఎస్ చేసిన లోకేష్ మొదటి నుంచి సగటు విద్యార్ధే. అయితే తాను ఎదిగి వచ్చిన తర్వాత తండ్రి తొమ్మిదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండడం జాతక రీత్యా అతని అదృష్టం. మొదట హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని చూసుకుందామనుకున్నా అక్కడ చూసుకోడానికి పెద్దగా పనిలేదు. ఆ గేదెలు పాలు ఇస్తూనే ఉన్నాయి. అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి.
మీడియాపై లోకేష్ కంటే చంద్రబాబుకే ఎక్కువ ఆసక్తి ఉంది. అందుకే ఆయన కొనుక్కున్న చానల్ ను వేరేవారికి కట్టబెట్టేకంటే కొడ్డుక్కే గిఫ్ట్ గా ఇచ్చేస్తే బాగుంటుందనుకున్నారు. ఈటీవీ సుమన్ లాగా కథ, మాటలు, మాటలు, నటన, మసాలా, అల్లం, వెల్లుల్లి అన్నీ తానే కాకుండా కాస్త కార్పొరేట్ స్టైల్ లో చానల్ ను నడూపుకోమని బాబు తన చిన్ని బాబుకు సలహాలు ఇస్తున్నారట. చేసుకోవలసింది వ్యాపారమే కానీ తీటలు తీర్చుకోవడం కాదని చంద్రబాబు అనుభవంతో కుమారుడికి మంచి మాటలు చెబుతున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి