తుస్సుమన్న జ 'గన్'

ఓదార్పు యాత్ర అంటూ వరంగల్ జిల్లాకు పయనమైనప్పు జగన్ పెద్ద హీరో. ఇప్పుడు పెద్ద జీరో. కాంగ్రెసు అధిష్టానవర్గం ఉద్దేశపూరితంగా అతని గాలి తీసేసింది. వీరప్ప మొయిలీకి తన తండ్రి కోట్లాది రూపాయలు కానుకగా సమర్పించుకున్న విషయం తెలిసిన జగన్ మొయిలీ తనకు అనుకూలంగా ఉన్నాడని భ్రమించి ఓదార్పు యాత్రకు కాంగ్రెసు హై కమాండ్ అనుమతించిందని గొప్పలు చెప్పుకున్నాడు. చివరికి చతికిలపడ్డాడు. వైయస్ అక్రమార్జనపై రహస్య విచారణ జరిపించిన హైకమాండ్ కు అనేక విషయాలు తెలిసివచ్చాయి.
చంద్రబాబు అవినీతి కంటే వైయస్ అక్రమార్జన వందరెట్లు అన్న విషయం తెలిసి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ అర్రులు చాచి, శవ రాజకీయాలు చేస్తున్నాడన్న విషయం కూడా స్పష్టంగా తెలిసివచ్చింది. ఈ నేపధ్యంలో జగన్ కు కాంగ్రెసు పార్టీలో భవిష్యత్తు ప్రశ్నార్ధకమే. కాంగ్రెసులో చిరంజీవులకు స్ధానం ఉంటుంది కానీ జగన్ లాంటి ధిక్కార స్వభావం ఉన్నవారికి భవిష్యత్తు ఉండదని తేలిపోయింది. జగన్ సొంత పార్టీ పెట్టుకుంటారా? తన వ్యాపారాలతో సరిపెట్టుకుంటారా అన్నది ఇప్పటి పెద్ద ప్రశ్న.












Click it and Unblock the Notifications