డి శ్రీనివాస్ తెలంగాణపై ఏం చెబుతారు?

Srinivas
ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ పరిస్ధితి. ఆయన త్వరలో శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పవలసి ఉంది. తెలంగాణకు అనుకూలంగా చెబితే ఆయనకు కొన్ని నష్టాలున్నాయి. వ్యతిరేకంగా చెబితే మరిన్ని నష్టాలు ఉన్నాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా టిఆర్ ఎస్ కు ఎక్కువ సీట్లు ఇప్పించింది డిఎస్సే. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని వీలైనప్పుడల్లా సోనియా గాంధీ చెవిలో ఆయన చెప్పి వస్తున్నారు.

కాంగ్రెస్‌ తెలంగాణ పై తన నిర్ణయాన్ని తెలంగాణకు అనుకూలంగా చెబుతుందా, వ్యతిరేకంగా చెబుతుందా అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ అధ్యక్షులు ఆ పార్టీ అభిప్రా యం చెప్పాలని కమిటీ సూచించింది. దీంతో అధ్యక్షులు అంటే రాష్ట్ర అధ్యక్షులా? జాతీయ అధ్యక్షులా? అనే అయోమయ పరిస్థితి కాంగ్రెస్‌లో నెలకొన్నది. ఒక వేళ పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ఇప్పటికే తెలంగాణ వాదిగా ముద్రపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆయన తెలంగాణకు అనుకూలంగా, వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పినా ఇబ్బందులు తప్పవు. లేదంటే ఏఐసీసీ అధ్య క్షురాలు సోనియా గాంధీ పార్టీ అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీకి తెలియజేయాలి. అలా కాకుండా పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ తోనే ఆమె పార్టీ అభిప్రాయం కమిటీకి చెప్పిస్తారా అనేది కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

జాతీయ పార్టీల రాష్ట్ర అధ్య క్షులుగాని, జాతీయ అధ్యక్షులుగాని ఎవరో ఒకరు పార్టీ అభిప్రాయా న్ని తెలియజేయాలని శ్రీకృష్ణ కమిటీ మెంబర్‌ సెక్రటరీ దుగ్గల్‌ గురువారం ఢిల్లీలో స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్‌ వైపు నుంచి సోనియా, డీఎస్‌ లలో ఎవరో ఒకరు కమిటీకి పార్టీ అభిప్రాయం తెలియ జేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో డీఎస్‌ మాత్రం ఆసక్తి చూపించడం లేదనే విషయం ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు పేర్కొ న్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+