వైయస్ జగన్ హీరో అయ్యెన్!

YS Jagan
జగన్ మొండితనం తెలిసిన వారికి అతను ఎవరు అడ్డుపడినా వరంగల్ ఓదార్పు యాత్రను రద్దు చేసుకోరని తెలుసు. కానీ రాయలసీమ నుంచి వందలాది మంది జగన్ మనుషులు వరంగల్ జిల్లాలో వివిధ పాయింట్లకు చేరుకోవడం తెలంగాణలో చర్చనీయాంశమైంది. తన తండ్రి రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చడానికి జగన్ ఓదార్పు యాత్రతో సాహసోపేతంగా వరంగల్ జిల్లాకు ప్రయాణమయ్యారు. తల్లి విజయమ్మ తనయుడిని ముద్దాడి ఈ పవిత్ర కార్యానికి దీవించి పంపారు.

అధిష్టానవర్గం వారించినా, రాష్ట్ర ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించినా లెక్కచేయకుండా జగన్ చేస్తున్న ఈ యాత్రకు మంచి స్పందనే కన్పిస్తోంది. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఒక ముఖ్యమంత్రి కంటే ఎక్కువ భద్రత జగన్ కు లభిస్తోంది. ఇంతమంది పోలీసులు ఉన్నా రాయలసీమ గూండాలను ఎందుకు దింపారన్నది తెలంగాణ మేధావుల ప్రశ్న. జగన్ పర్యటనతో తెలంగాణ వాదం నీరుకారిందన్న వాదన కూడా విన్పిస్తోంది. జగన్ పర్యటనను టిఆర్ ఎస్ వాళ్ళు విజయవంతంగా అడ్డు కోలేకపోవడం చర్చనీయాంశమైంది.

ఇది వ్యక్తిగత పర్యటన అని జగన్ వర్గీయులు చెబుతున్నప్పటికీ ఇది ఇటు కాంగ్రెస్ లోనూ, అటు టిఆర్ ఎస్ లోనూ సంచలనం కలిగిస్తోంది. జగన్ మీద ప్రత్యేకాభిమానం ఉన్న హోం మంత్రి సబితకు, ముఖ్యమంత్రి రోశయ్యకు జగన్ భద్రత విషయంలో బేధాభిప్రాయాలు తలెత్తాయి. మొత్తమ్మీద ఈ పర్యటనతో జగన్ హీరోగా మారారు. ఎంతో ఖర్చుతో ఆయన పెట్టుకున్న సాక్షి మీడియా ఆయనకు ఇప్పుడు చక్కగా ఉపయోగపడుతోంది. జర్నలిస్టులు కూడా కత్తులు, డాళ్ళు ధరించి జగన్ ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సర్వే జనా సుఖినోభవంతు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+