తెలంగాణకు కావూరి అడ్డం వేశారా?

సోమవారం చిరంజీవితోనూ రేణుకా చౌదరితోనూ మినీ కోర్ కమిటీ చర్చలు జరిపిన తర్వాత మూడో దశలో జాతీయ పార్టీలతో చర్చలు జరపాల్సి ఉందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రకటన చేసి, తెలంగాణపై ఇప్పుడే తేల్చబోమని చెప్పకనే చెప్పారు. మంగళవారం కోర్ కమిటీ సమావేశం కూడా సకల జనుల సమ్మెను విరమింపజేయడంపైనే దృష్టి సారించింది తప్ప తెలంగాణపై తన వైఖరిని ప్రకటించడంపై పెట్టలేదు. ఏమైనా, తెలంగాణపై కాంగ్రెసు వైఖరి ఇప్పట్లో తేలే విధంగా లేదు.












Click it and Unblock the Notifications