టీవీ యాంకర్‌గా మారిన ప్రముఖ భారతీయ మోడల్ పద్మాలక్ష్మి (40) చిక్కుల్లో పడ్డారు. ఆమె 11 నెలల కుమార్తెకు తండ్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి కేసు వేయడంతో ఆమె ఇబ్బందుల్లో పడ్డారు. పద్మాలక్ష్మీ కుమార్తె కృష్ణ థెయాను చూడడానికి తనకు పూర్తి హక్కులు కల్పించాలని సీనియర్ వ్యాపారవేత్త ఆడం డెల్ న్యూయార్క్ న్యాయస్థానంలో కేసు వేశారు. నెలలో 9 రోజులు ఆ పాపను చూడడానికి ఆయనకు అనుమతిస్తూ కుదిరిన అనధికార ఒప్పందం ఫిబ్రవరి 20తో ముగుస్తుంది. ఆ తేదీనాటికి పాపకు ఏడాది నిండుతుంది. దీంతో న్యాయపరంగా ముందుకు వెళ్లాలని డెల్ భావిస్తున్నారు. తన కుమార్తెకు తండ్రి ఎవరో పద్మాలక్ష్మి ఇప్పటికీ నిర్ధారించడం లేదు.