చిరంజీవి కన్నా విజయ్‌కాంత్ బెట్టర్

ఒక్క సీటు గెలిచినా ఏ మాత్రం నిరాశపడకుండా తన పార్టీ డిఎండికెను ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో అన్నాడియంకెతో పొత్తు పెట్టుకుని 41 సీట్లకు పోటీ చేసి 29 సీట్లు గెలుచుకున్నాడు. చిరంజీవి మాత్రం పార్టీని నడిపించలేక కాంగ్రెసులో విలీనం చేయడానికి పూనుకున్నారు. ఈ విషయంలో విజయ్ కాంత్‌ను చిరంజీవి కన్నా బెట్టర్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీల్లో ఓ ప్రాంతీయ పార్టీని దెబ్బ తీస్తే తన మనుగడ సాధ్యమని గ్రహించిన విజయ్ కాంత్ ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధ పడ్డారు. ప్రభుత్వంలో చేరాలని అన్నాడియంకె నేత జయలలిత ఆఫర్‌ను తోసిపుచ్చారు. కరుణానిధి నాయకత్వంలోని డిఎంకెకు కేవలం 23 సీట్లే దక్కడంతో విజయ్‌కాంత్‌కు ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఆ రకంగా పార్టీని బలోపేతం చేయడానికి వీలవుతతుందనేది విజయ్ కాంత్ అభిప్రాయం.












Click it and Unblock the Notifications