వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ నోళ్లు నొక్కేశారా?

పార్టీ తరఫున మాట్లాడేందుకు సలహాదారు సిసి రెడ్డిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. సిసి రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైయస్సార్ హయాంలో సిసి రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు వైయస్ జగన్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. అందుకే, వైయస్సార్ కాంగ్రెసు తరఫున ఏం మాట్లాడాల్సి వచ్చినా, ఎవరిని తిట్టాల్సి వచ్చినా ఆయన నోరు చేసుకుంటున్నారని అంటున్నారు.