వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఎమ్మెల్యేల డైలమా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వర్గం పోటీ చేయదని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రకటించడంతో ఆయన వర్గానికి చెందిన శాసనసభ్యులు డైలమాలో పడ్డారు. పార్టీని స్థాపించిన తర్వాతనే ఏ ఎన్నికల్లోనైనా తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పార్టీకి చెందిన శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆత్మప్రబోధం ప్రకారం ఓటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు శనివారం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకుంటున్నారు.

వైయస్ జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ రెడ్డి, రామచంద్రా రెడ్డి శనివారం సమావేశమైన చర్చలు జరిపారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ఓటు చేయాలా, మరెవరికైనా ఓటు చేయాలనే సందేహంలో వైయస్ జగన్ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పడ్డారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దృష్ట్యా శాసనసభ్యుల కోటా కింద జరిగే ఎన్నికల్లో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకే ఓటు చేయాల్సి రావచ్చు. ఈ స్థితిలో కాంగ్రెసు వ్యూహం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.

English summary
YS Jagan camp MLA and local bodies public representatives are dilemma to follow the strategy in MLC elction. YS 
 
 Jagan camp MLA are planning to adapt a strategy in election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X