జగన్ భయం: కెసిఆర్‌తో చిరు తరహా ప్యాకేజీ

సీమాంధ్రలో భవిష్యత్తు వైయస్ జగన్ కారణంగా తమ పార్టీ భవిష్యత్తు అంధకార బంధురమవుతుందని గ్రహించిన కాంగ్రెసు అధిష్టానం తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతిలో నాయకత్వాన్ని పెట్టడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో కెసిఆర్‌ను వాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెరాసను తమ పార్టీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను కెసిఆర్ ముందు ఉంచాలని, అందుకు కెసిఆర్‌కు చిరంజీవికి ఇచ్చినట్లే కొన్ని వాగ్దానాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇది ఆవశ్యకమని కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. సీమాంధ్రలో పార్టీ బరువు బాధ్యతలను చిరంజీవి పెట్టాలని ఆలోచిస్తోంది.
విలీనం ప్రతిపాదనతో తెరాస ముందుకు వచ్చిందని, ఇందుకు సంబంధించిన తన వద్ద కచ్చితమైన సమాచారం ఉందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి, రాయలసీమ నేత టిజి వెంకటేష్ అన్నారు. గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, జైపాల్ రెడ్డి వంటి నాయకులతో టిజి వెంకటేష్ ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ అంశం త్వరలో తేలుతుందని ఆయన చెప్పారు. తెరాస విలీనం ప్రతిపాదనతో తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.












Click it and Unblock the Notifications