జగన్‌పై సాఫ్ట్ కార్నర్: కెసిఆర్‌కు కెకెఎంఆర్ సవాల్

పరకాల ఉప ఎన్నికల్లో తన బలం తెలిసిన నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో బలంగా ఉన్న టిఆర్ఎస్‌ను దెబ్బ తీసే వ్యూహంలో భాగంగా కెసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని వ్యూహాత్మకంగా ఎన్నుకున్నారని, అక్కడ చేనేత కార్మికులు అధికంగా ఉండటంతో అందుకు సంబంధించిన అంశంతోనే దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
తెలంగాణలో ఎంట్రీ కోసం జగన్ వ్యూహాత్మకంగా వెళ్లడం ఓకే... కానీ ఆ తర్వాత కెసిఆర్ వైఖరే ఎవరీకి అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గాని, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గానీ తెలంగాణకు వచ్చినప్పుడు వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన కెసిఆర్, పాలమూరులో బిజెపి గెలిచిన తర్వాత తన పార్టీ అస్తిత్వం కాపాడుకునేందుకు తెలంగాణవాదం గట్టిగా వినిపిస్తున్న ఆ జాతీయ పార్టీని కూడా ఏకీపారేసిన కెసిఆర్... జగన్ విషయంలో మాత్రం మౌనంగా ఎందుకు ఉంటున్నారనే చర్చ జోరుగా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
విజయమ్మ పర్యటనపై తెరాస కార్యకర్తల నుండి ఆయన తనయుడు కెటిఆర్ వరకు అందరూ ధ్వజమెత్తారు. చివరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు, టి-కాంగ్రెసు నేతలు కూడా విజయమ్మ, జగన్ పై మండిపడ్డారు. టి-కాంగ్ ఎంపీలైతే ఏకంగా పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కే ఫిర్యాదు చేశారు. కానీ కెసిఆర్‌లో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. ఆయన బయటకే కనిపించడం లేదు. ఓ వైపు తనయుడు జగన్‌పై మండిపడుతుంటే కెసిఆర్ మాత్రం సైలెంట్‌గా ఉండటం గమానార్హం.
నిన్నటి వరకు తెరాసలో ఉండి, తాను చెప్పినట్లుగా చేసిన నిన్నటి టిఆర్ఎస్ నేత నేటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి(కెకెఎంఆర్) సిరిసిల్ల దీక్ష ద్వారా సవాల్ విసిరుతోంది.. కేవలం కెటిఆర్‌కు మాత్రమే కాదని, అతనిని పావుగా ఉపయోగించుకొని కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. పార్టీ తొలి నుండి కెకె మహేందర్ రెడ్డి తెరాసలో ఉన్నారు.
2009లో తన తనయుడు కెటిఆర్ కోసం కెసిఆర్ కెకెఎంఆర్‌ను పక్కకు పెట్టారు. అప్పటి నుండి కెకెఎంఆర్ కెసిఆర్‌ను టార్గెట్‌గా చేసుకున్నారని అంటున్నారు. 2009లో టిక్కెట్ దక్కక పోయేసరికి ఆయన అప్పుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో కలిశారు. తాజాగా ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిశారు. ఆయన ఎవరితో కలిసినా తనను మోసం చేసిన కెసిఆర్‌కు గట్టి ఝలక్ ఇవ్వాలంటే ఆయన తనయుడు కెటిఆర్‌ను అదే సిరిసిల్లలో ఓడించడమే లక్ష్యమంటున్నారు.












Click it and Unblock the Notifications