9న కిరణ్‌కు షాక్: సిఎం రేసులో మర్రి!?

అందులో భాగంగా కిరణ్‌ను మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మరొకరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. రేసులో జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ప్రధానంగా ఉన్నారట. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్‌ల పేర్లను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది.
మర్రి కుటుంబానికి పార్టీ అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి, వివాదరహితుడు కావడం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ఉన్న అనుబంధం తదితరాలు బాగా కలిసి వస్తాయని అంటున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులకు శశిధర్ రెడ్డి విందు కూడా ఇచ్చారు. అయితే తన తండ్రి మర్రి చెన్నా రెడ్డి మీద పైన తెలంగాణ ఉద్యమం విషయంలో ఇప్పటికీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆ పదవికి ఓకె చెప్తారా లేదా అనేది చూడాలని అంటున్నారు.
మర్రి తర్వాత డి శ్రీనివాస్ పేరును కూడా సీరియస్‌గానే పరిశీలిస్తోందని అంటున్నారు. డి శ్రీనివాస్‌కు తెలంగాణతో పాటు సీమాంధ్రలోనూ మద్దతు లభిస్తోందని అధిష్టానం భావిస్తోందని సమాచారం. దీంతో ఆయనకు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తోందని అంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి కాకపోయినా పార్టీలో మరో ప్రాధాన్యత ఉన్న పదవిని ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం.
ముఖ్యమంత్రి పదవి తప్ప మిగిలిన అన్ని శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన జానా రెడ్డి పేరును కూడా పరిశీలిస్తోందట. సిఎం మార్పుపై కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ అధిష్టానం ఖండిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా మార్పు జరుగుతుందా లేక పార్టీ అధిష్టానం తన వైఖరిని మరోసారి వాయిదా వేసుకుంటుందా చూడాలి.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications