సుబ్బిరామిరెడ్డి డిజిటల్ స్క్రీన్ల ప్రచారం

T subbirami Reddy
నెల్లూరు కాంగ్రెసు లోకసభ అభ్యర్థి టి. సుబ్బిరామి రెడ్డి ప్రచారంలో వినూత్న పంథా తొక్కుతున్నారు. భారీ డిజిటల్ స్క్రీన్లపై ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భారీ వాహనాలను ఏర్పాటుచేసుకుని వాటిపై డిజిటల్ స్క్రీన్లను అమర్చి రద్దీగా ఉండే కూడళ్లలో ప్రచార ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మిరిన్ని వినూత్న మార్గాలను కూడా ఆయన ప్రచారానికి కనిపెట్టారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న తిక్కవరపుసుబ్బరామిరెడ్డి ఈ నెల 6న న తన లలిత కళాపరిషత్ ద్వారా నెల్లూరు నగరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీతారలంతా తరలివచ్చి టిఎస్‌ఆర్‌ను ఆకాశానికి ఎత్తి పొగడ్తల వర్షం కురిపించిన ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లపై లోకసభ పరిధిలో ప్రదర్శిస్తున్నారు.

తొలుత వైయస్సార్ కాంగ్రెస్ తరపున ఆ పార్టీ తొలి ప్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రసంగాలు, గతంలో జరిగిన ఇతర కార్యక్రమాల్ని డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్వహించగా అంతకంటే ఎక్కువ సంఖ్యలో స్క్రీన్లను తెప్పించి టి. సుబ్బిరామిరెడ్డి ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుసరించిన మార్గాన్ని అందుకుని టిఎస్ఆర్ వారిని దెబ్బ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నెల్లూరుకు చెందిన టి. సుబ్బిరామిరెడ్డి గతంలో విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సుబ్బిరామిరెడ్డికి ఉన్న పలుకుబడి దష్ట్యా కాంగ్రెసు అధిష్టానం ఆయనను నెల్లూరులో పోటీకి దించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+