బాబుకు మరో షాక్: జగన్ పార్టీలోకి శివప్రసాద్?

గత కొంత కాలంగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఆయన ఇటీవల ఓ సందర్భంలో ప్రశంసలతో ముంచెత్తారు. చిత్తూరు జిల్లాకు చెందిన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసులో చేరారు. చర్చలు కొలిక్కి వస్తే శివప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఎంతో కాలం పట్టదని అంటున్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వారి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు లింగయ్య, బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీనుంచి వైదొలగి వైయస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈమేరకు లోక్‌సభ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి రెండు రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహిస్తున్న వైవి సుబ్బారెడ్డితో భేటీ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి తెలియజేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ సోదరి షర్మిల పాదయాత్ర నల్లగొండ జిల్లాకు చేరే సందర్భంలో ఆ పార్టీలో చేరేందుకు ముహూర్తాన్ని నిర్ణయించారు. అదే విధంగా నల్లగొండ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications