వైయస్ విజయమ్మ దీక్ష: కెటిఆర్ గుండెల్లో గుబులు

సిరిసిల్ల నుంచి కెటి రామారావును ఢీకొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున కెకె మహేందర్ రెడ్డి సిద్ధపడుతున్నారు. గతంలో ఆయన కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తన పట్టు వీడడం లేదు. పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ తెరాస అభ్యర్థి బిక్షపతి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. బిక్షపతి బొటాబొటీ మెజారిటీతో కొండా సురేఖపై విజయం సాధించారు.
వైయస్ విజయమ్మ దీక్షతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో తెరాసకు సవాల్ విసురుతున్నట్లే ఉన్నారు. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రావడానికి వివిధ జిల్లాల్లో నాయకులు రెడీగా ఉన్నారు. తెలంగాణవాదం కారణంగా వారు పార్టీలోకి రావడం లేదు. కెకె మహేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్,త కొండా సురేఖ, కొమ్మూరి ప్రతాప రెడ్డి వంటివారు మాత్రం ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి తమ సత్తాను చాటడానికి సిద్ధపడుతున్నారు.
తెలంగాణ సెంటిమెంటును అధిగమించి, తెలంగాణలో పాగా వేయాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఉన్నారు. ఇందుకు వైయస్ విజయమ్మ సిరిసిల్ల చేనేత దీక్ష ప్రారంభాన్ని ఇస్తుందని అంటున్నారు. వైయస్ విజయమ్మ చేనేత దీక్షకు వచ్చే మద్దతును బట్టి తెలంగాణలో క్రమంగా కార్యక్రమాలను విస్తరించుకుంటూపోవాలనేది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే కెటి రామారావు వైయస్ విజయమ్మ దీక్షపై తీవ్రంగా మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications