వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: పలికింది గంటా, పలికించింది చిరంజీవి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Ganta Srinivas Rao
హైదరాబాద్: తెలంగాణ డిమాండ్‌కు వ్యతిరేకంగా సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా తమ కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 17వ తేదీన పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. గంటా శ్రీనివాస రావు ఇంత దూకుడు ప్రదర్శించడం వెనక కేంద్ర మంత్రి చిరంజీవి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

తాను కేంద్ర మంత్రిగా ఉండడంతో రాష్ట్ర విభజనపై మాట్లాడడం మంచిది కాదని, తన గౌరవానికి భంగం వాటిల్లుతుదని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనాల్సిన మాటలను చిరంజీవి గంటా శ్రీనివాస రావుతో అనిపించారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు చిరంజీవి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయక ముందు సమైక్యాంధ్ర కోసం చిరంజీవి సీమాంధ్రలో పర్యటనలు కూడా చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చిరంజీవి పూర్తి వ్యతిరేకమనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఓ వైపు తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూ చిరంజీవి తెరవెనక తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు వినికిడి. చిరంజీవికి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు మధ్య సాన్నిహిత్యం ఉంది.

లగడపాటి రాజగోపాల్‌తో కలిసి చిరంజీవి వర్గానికి చెందిన నాయకులు సమైక్యాంధ్ర కోసం ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. గంటా శ్రీనివాస రావుతో పాటు చిరంజీవికి సన్నిహితులైన మరింత మంది సమైక్యవాదులు తెలంగాణను అడ్డుకోవడానికి ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

English summary

 It is said that the union minister Chiranjeevi is working behind the scenes agaibst Telangana and the minister Ganta Srinivas Rao's statement is evident for that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X