కిరణ్‌కు షాక్: ప్యాకేజీ నుండి విభజన వైపుకు..

మొదట విభజన సాధ్యం కాదని, ప్యాకేజీ ఇస్తే బాగుంటుందని ఢిల్లీ పెద్దలు భావించారట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా చెప్పారట. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రికి సూచిందని చెబుతున్నారు. అయితే ప్యాకేజీ ప్రకటిస్తే బడ్జెట్ సమావేశాలలో ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉందని, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే ప్రభుత్వమే ఇబ్బందుల్లో పడుతుందనే ఆందోళన ప్రారంభమైందట.
దీంతో ప్యాకేజీ ప్రకటన ఆగిపోయింది. అయితే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, రాయల తెలంగాణ, సమైక్యం, భారీ ప్యాకేజీ.. తదితరాలపై తర్జన భర్జన పడింది. అన్నీ ఆలోచించిన అధిష్టానం తెలంగాణ లేదా రాయల తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని భావించిందట. ఆ తర్వాత తెలంగాణ వైపు మొగ్గు చూపిందంటున్నారు.
గతంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ పరిష్కారానికి నెల రోజుల గడువు పెట్టారు. అప్పుడే ప్యాకేజీకి అధిష్టానం సిద్ధమైతే ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాల వరకు ఆగమని సూచించారట. ఇప్పుడు కూడా ప్యాకేజీ ఇద్దామనుకున్న అధిష్టానం తర్జన భర్జన అనంతరం విభజనే మంచిదనే అభిప్రాయానికి వచ్చిందంటున్నారు.
మరోవైపు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను రోడ్ మ్యాప్‌తో సిద్ధంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. ఎప్పుడైనా పిలుపు రావొచ్చునని, సిద్ధంగా ఉండాలని సూచించిందట.












Click it and Unblock the Notifications