• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అక్బర్ అరెస్టు: ఓవైసీ ఫ్యామిలీకి తొలి షాక్

By Pratap
|
First shock to Owaisi family
హైదరాబాద్: ఓవైసీ కుటుంబానికి రాష్ట్రంలో తొలి షాక్ తగిలింది. ద్వేషపూరిత వ్యాఖ్యలకు గాను మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ అరెస్టు కావడం ఓవైసీ కుటుంబానికి తిరుగులేని ఎదురు దెబ్బనే. హైదరాబాద్ పాతబస్తీలో ఓవైసీ కుటుంబానికి ఇప్పటికి వరకు ఎదురు లేదు. అక్బర్ అరెస్టు ఓవైసీ కుటుంబాన్ని దిగ్భ్రమకు గురి చేసిందనే చెప్పాలి.

పాతబస్తీని తమ సామంత రాజ్యంగా చేసుకున్నట్లు ఓవైసీ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తూ వస్తున్నారు. పాలక పార్టీల అండదండలతో వారు పాడిందే పాట, ఆడిందే ఆటగా కొనసాగుతూ వచ్చింది. దేశద్రోహం, దేశ సారభౌమత్వాన్ని సవాల్ చేయడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద అక్బరుద్దీన్‌పై కేసులు పెట్టారు. ఇంత తీవ్రమైన సెక్షన్ల కింద ఓవైసీ కుటుంబ సభ్యులెవరూ ఇంతకు ముందు అరెస్టు కాలేదు.

అక్బరుద్దీన్‌ను అరెస్టు చేసే సాహసం చేస్తారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న తరుణంలో ప్రభుత్వం తెగువతో వ్యవహరించింది. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పెద్ద ప్రయత్నమే చేశారు. కానీ, ఆ ప్రయత్నాలను పోలీసులు వమ్ము చేశారు. ముస్లిం మైనారిటీలకు తాము తప్ప దిక్కు లేదనే తరహాలో ఓవైసీ సోదరులు వ్యవహరిస్తూ వచ్చారు. అందువల్ల తమకు వారి మద్దతు ఉంటుందని, దాంతో తాము ఎంత దూరమైన వెళ్లవచ్చునని భావించారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి.

1970 దశకంలో, అంతకు ముందు పాతబస్తీలో మత ఘర్షణలు తరచుగా జరుగుతున్నప్పుడు సాలారా సల్లావుద్దీన్ ఒవైసీని పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేసి బెయిల్‌పై విడుదల చేసేవారు. ఆయన కుమారుడు, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ పైనా ముస్లింలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణపై తెలుగుదేశం పార్టీ హయాంలో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాంటి చిన్నా చితకా కేసులు తప్ప ప్రస్తుతం అక్బర్‌పై నమోదు చేసినంత తీవ్రమైన కేసులు ఎన్నడూ సాలార్‌ కుటుంబంపై నమోదు కాలేదు.

సుప్రసిద్ధ ఉర్దూ దినపత్రిక సంపాదకుడొకరిపై అర్ధరాత్రివేళ దాడి జరపటం, ఆయనపై అశుద్ధం చల్లించటం, బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ తన రచన లజ్జ తెలుగు అనువాద ప్రతి ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, నీలోఫర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లపై దాడి చేయటం, గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అసదుద్దీన్‌ ఒవైసీ స్వయంగా దుడ్డుకర్ర చేతబట్టి వోటర్లను తరిమి కొట్టటం, అప్పట్లో డిజిపి స్థాయిలో ఉన్న అధికారిని యూనిఫామ్‌ తీసి వస్తే పాతబస్తీలో తడాఖా చూపిస్తామని బెదిరించటం వంటి దుందుడుకు చర్యలకు ఓవైసీ సోదరులు పాల్పడిన సందర్భాలున్నాయి. ఇటువంటి చర్యలతో సెక్యులర్ ముస్లిం మేధావుల మద్దతును మజ్లీస్ పూర్తిగా కోల్పోయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
21,84,467
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  0.00%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  100.00%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  3.89%
  ఎస్సీ
 • ఎస్టీ
  1.24%
  ఎస్టీ

English summary
Owaisi family has shock with the arrest of MIM MLA Akbaruddin Owaisi's arrest on hate speech. Owaisi family has made Hyderabad old city as its bastion.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more