'అభిప్రాయ రిగ్గింగ్: జగన్‌కోసం దొంగ సంతకాలా?'

అయితే ఇందులో దొంగ సంతకాలు ఉన్నట్లుగా పరిశీలనలో తేలిందని ప్రముఖ తెలుగు ఛానల్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది. దీంతో జగన్ కోసం చేసిన కోటి 96 లక్షల సంతకాలలో అసలు సంతకాలు ఎన్ని? దొంగ సంతకాలు ఎన్ని? అనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొంది. సంతకాలు అసలువి కావు.. కాబట్టే మీడియాకు అందుకు సంబంధించిన సిడిలను ఇవ్వలేదని తెలిపింది.
సంతకాలను పరిశీలిస్తే పెన్ను మార్చకుండా వరుసగా పలు సంతకాలు కనిపించాయని, ఒకేవిధమైన చేతిరాతతో పలు సంతకాలు ఉన్నాయని, ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలింప చేస్తే మూడు వందల సంతకాలు ఒకే వ్యక్తి పెట్టినట్లుగా తేలిందని, సంతకాలు పెట్టిన వారిలో పలువురికి ఫోన్ చేస్తే తాము సంతకం పెట్టలేదని, తమకు తెలియదని చెప్పారని, ఫోన్‌లలో కొన్ని ఫేక్‌విగా తేలాయని, మరికొన్ని ఇతర రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయని తెలిపింది. నియోజకవర్గాలలో ఆ పార్టీ నేతలు టార్గెట్ పెట్టి మరీ సంతకాలు చేయించినట్లుగా తెలిసిందని పేర్కొంది. ఇది ప్రజాభిప్రాయ రిగ్గింగ్ అని అభిప్రాయపడింది.
కాగా జగన్ విడుదలను కోరుతూ తాము అతి తక్కువ సమయంలో కోటీ 96 లక్షలు సేకరించామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పినప్పుడే తెలుగుదేశం పార్టీతో సహా పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications