గురునాథ్‌పై మాట మార్చిన హస్సీ

బెట్టింగ్ వ్యవహారంలో గురునాథ్ మేయప్పన్ అరెస్టయిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో పడింది. దీంతో గురునాథ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో సంబంధం లేదంటూ జట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత హస్సీ ఆత్మకథలో వ్యాఖ్యలు వెలుగు చూశాయి.
జట్టు గురునాథ్ పాత్ర ఏమిటో తనకు స్పష్టం తెలియదని హస్సీ అన్నాడు. గురునాథ్ సూపర్ కింగ్స్ కోచ్ కెప్లెర్ వెసెల్స్‌తో, ఆటగాళ్లతో మాట్లాడుతూ ఉండేవాడని, శిక్షణా శిబిరంలోనూ హోటల్లోనూ కనిపిస్తూ ఉండేవాడని, అయితే గురునాథ్‌కు ఏ విధమై అధికారం అప్పగించారో తనకు తెలియదని హస్సీ వివరణ ఇచ్చాడు.
తాను ఇండియా సిమెంట్స్ వైయస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్‌ను కలిసి క్షమాపణలు కోరినట్లు ఆయన తెలిపారు. ఆందోళన వద్దని, అంతా బాగానే ఉందని శ్రీనివాసన్ తనతో అన్నట్లు కూడా ఆయన తెలిపాడు.












Click it and Unblock the Notifications