వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంపై పవర్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా కలత చెందినట్లు ప్రచారం సాగుతోంది. ఆయన గత 13 రోజులుగా ఇంటి పట్టునే ఉండి తీవ్రంగా బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఆయన గత 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ రాష్ట్రాన్ని చీల్చే నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారట. ఆయన నిమ్మరసం, నీళ్లు మాత్రమే తీసుకుంటూ, తనకు ఇష్టమైన పుస్తకాలు చదువుతూ ఇంట్లో ఉంటున్నాడని ప్రచారం సాగుతోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలని, వస్తారని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పోస్టులు ఊపందుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఉంటే తాను ఆయనకే ఓటు వేసి ఉండేవాడినని ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఇటీవల వ్యాఖ్యానించాడు. పవన్ కళ్యాణ్‌ చిరంజీవి తమ్ముడు కాకుండా ఉంటే ఇంకా పైస్థాయిలో ఉండేవాడని కూడా ఆయన అన్నారు.

నిజానికి, పవన్ కళ్యాణ్‌కు చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులు దండిగా ఉన్నారు. గబ్బర్ సింగ్ సక్సెస్‌తో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. మానవ సంబంధాల పట్ల అతను ప్రదర్శించే పట్టింపును కూడా చాలా మంది పొగిడేయడం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. తన సహజమైన శైలిలో దూకుడుగా, నిర్మొహమాటంగా వ్యవహరించారు.

అన్నయ్యను ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. కానీ ఫలించలేదు. దాంతో ఆయన తీవ్ర నిరాశకు గురైనట్లు చెబుతారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం కూడా ఆయనకు నచ్చలేదని అంటారు. ఈ స్థితిలో ఆయనకు రాజకీయాలపై ఆసక్తి సన్నగిల్లిందని అంటున్నారు. రాజకీయాల్లోకి రావడానికి ఆయన సుముఖంగా లేరట. ఏమైనా పవన్ కళ్యాణ్‌ను మించిన హీరో లేడని అంటారు.

English summary
It is said that power star Pawan Kalyan is observing fast in protest against the bifurcation of AndhraPradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X