వివాదం: గజల్ శ్రీనివాస్‌కు ఐపిఎస్ ఎస్కార్ట్!
ఓ ఐపిఎస్ అధికారి ప్రముఖ గజల్స్ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు తీసుకు రావడం విమర్శలకు దారి తీస్తోంది! ఎపిఎన్జీవోల సభకు ఉద్యోగులను మాత్రమే అనుమతించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సభకు ఓ అధికారి గజల్ శ్రీనివాస్‌ను ఎస్కార్టుగా ఉండి తీసుకు వచ్చారట. దీనిని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు మాట్లాడుతూ... సదరు ఐపిఎస్ అధికారి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ విషయమై తమ పార్టీ ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. శనివారం జరిగిన సభలో గజల్ శ్రీనివాస్ తన ఆట, మాట, మాటలతో హోరెత్తించిన విషయం తెలిసిందే.

హైకోర్టు ఆంక్షల మేరకు ఉద్యోగులను మాత్రమే పోలీసులు స్టేడియంలోకి అనుమతిస్తుండగా గజల్ శ్రీనివాస్ అక్కడకు వచ్చారు. నిర్వాహకుల నుంచి తనకు ఆహ్వానం ఉన్నదని ఆయన తెలపగా, పోలీసులు పట్టించుకోలేదు. దీనిపై పోలీసులకు, గజల్ శ్రీనివాస్‌కు మధ్య మాటలు సాగింది. ఇంతలో అక్కడకు వచ్చిన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అతనిని వెంటబెట్టుకొని వేదిక వద్దకు తీసుకు వెళ్లారు. ఇదంతా అధికారి అండతోనే జరిగిందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
కాగా, సభలో పాల్గొనేందుకు వచ్చిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌పై ఓ వృద్ధుడు దాడికి ప్రయత్నించాడు. గజల్ శ్రీనివాస్‌కు, పోలీసులకు గేటు వద్ద వాదన జరుగుతుండగా ఆయనపై వృద్ధుడైన తెలంగాణవాది ఆగ్రహించాడు. శ్రీనివాస్ ఏదో చెబుతుండగానే చేతి రుమాలుతో తలపై కొట్టాడు. వృద్ధుడిని నర్సయ్య(70)గా గుర్తించారు.












Click it and Unblock the Notifications