జగన్ కేసులోకి చంద్రబాబు పేరు లాగిన రాంకీ

రాంకీ ఫార్మాసిటి లే అవుట్‌కు అనుమతులు వచ్చాయని, ఆ వెంటనే జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయని ఈడి తెలిపింది. ఫార్మాసిటికీ ఇచ్చిన భూములపై రాంకీ గ్రూపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి బుకాయించాలని చూసింది. ఫార్మాసిటికీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూములు కేటాయించారని, దీనికి వైయస్ రాజశేఖర రెడ్డితో ఎలాంటి సంబంధం లేదని రాంకీ ఫార్మా వాదించింది. దీనిని ఈడి కొట్టివేసింది.
ఫార్మా సిటి ప్రతిపాదన బాబు పాలనలో చివరిలో ప్రాణం పోసుకున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో రూపురేఖలు సంతరించుకున్నది మాత్రం వైయస్ హయాంలో మాత్రమేనని, జగన్ తండ్రిపై పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వానికి నష్టాన్ని చేకూర్చారని, ప్రారంభం కాబోయే తన కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేసి ముడుపులను పెట్టుబడుల రూపంలో ముట్టజెప్పిన వారికే ప్రాజెక్టుల ద్వారా లబ్ధి చేకూర్చారని ఈడి పేర్కొంది.
2003-04లో వైయస్ జగన్ చూపిన ఆదాయానికి, 2009 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపర్చిన ఆస్తులకు అసలు పొంతనలేదని న్యాయప్రాధికారిక సంస్థ పేర్కొంది. జగన్ 2003-04లో ఐటి రిటర్న్స్‌లో తన వార్షిక ఆదాయాన్ని రూ.9,19,951గా చూపారని, 2009 నాటి ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల విలువను రూ.77.40 కోట్లుగా పేర్కొన్నారని ఈడి తెలిపింది.












Click it and Unblock the Notifications