వెనుకబడ్డ జగన్: కెసిఆర్‌పై బాబు 'అసెంబ్లీ' ప్లాన్

సీమాంధ్రలో జగన్ ప్రభావం క్రమంగా కనుమరుగవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, తెలంగాణలో సెంటిమెంట్ దృష్ట్యా కెసిఆర్‌ను ఎదుర్కోవడంపై తెలంగాణ టిడిపి నేతలు అధిష్టానంతో కలిసి వ్యూహరచన చేస్తున్నారట. ఇటీవల తెలంగాణ ఉద్యమంలో బిజెపి, సిపిఐలు కూడా కీలకంగా ఉంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో తెలంగాణ ఓట్లు చీలడం ఖాయమని టిడిపి భావిస్తోంది.
అయితే, మెజార్టీ తెలంగాణ వాద ఓట్లు మాత్రం తెరాసకే పడుతాయి. ఈ నేపథ్యంలో తెరాసను ధీటుగా ఎదుర్కొనేందుకు టిడిపి పక్కా ప్రణాళికతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోందట. టిడిపి నుండి చాలామంది నేతలు తమ పార్టీలోకి వస్తారని తెరాస చేసిన ప్రచారంతో టిడిపికి ఇటీవల ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే, ఇప్పుడు అది తెరాసకే ఎదురు తిరిగిందని అంటున్నారు. తెరాస నుండి ముగ్గురు నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్దమయ్యారట.
ఇది తెరాసకు షాక్ కాగా.. తెలంగాణ టిడిపిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణపై తాము స్పష్టత ఇచ్చినప్పటికీ, ఏ స్పష్టత ఇవ్వని వైయస్సార్ కాంగ్రెసు, అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీని ప్రశ్నించకుండా కెసిఆర్ తమనే టార్గెట్ చేసుకోవడాన్ని అర్థం చేసుకోవాలని తెలంగాణ ప్రజల్లోకి టిడిపి బలంగా తీసుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా తెలంగాణపై పూర్తి స్పష్టతతో ఉన్న బిజెపి, సిపిఐతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కెసిఆర్ ఎందుకు చెప్పలేక పోతున్నారని, ఇవన్నీ కెసిఆర్ రాజకీయ లబ్ధి ఆరాటమేనని వారు ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు.
ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో ఇప్పటి నుండే తెలంగాణ ప్రజలను తమ వైపుకు తిప్పుకోవాలని టిడిపి భావిస్తోంది. తెలంగాణ టిడిపి హయాంలోనే అభివృద్ధి చెందిందని, తెలంగాణలో పట్వారీ, పటేల్ వ్యవస్థలను రూపుమాపింది టిడిపియేనని, అలాంటి టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదని వారు ప్రజల్లోకి వెళ్లి చెప్పనున్నారట. ప్రస్తుతం రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని చక్కదిద్దగలదని వారు ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారట.
తెలంగాణకు తాము అనుకూలమని, కేంద్రం తెలంగాణ ఇస్తే చంద్రబాబు వ్యతిరేకించే ప్రసక్తే లేదని, అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే తెలంగాణపై సభలో తీర్మానం ప్రవేశ పెడతామని టిటిడిపి నేతలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట. మరో వ్యూహాత్మక అడుగు కూడా వేసేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతోంది. పలువురు నేతలు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట.
తెరాస నుండి టిడిపిలోకి చేరుతారని ప్రచారం జరుగుతున్న చాడ సురేష్ రెడ్డి లాంటి సీనియర్ కూడా వరంగల్ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారట. ఆయన గతంలో ఎంపీగా పని చేశారు. ఆయనకు హన్మకొండ లోకసభ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అలాంటి నేత కూడా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారట. పలువురు నేతలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అది వ్యూహాత్మకమే అంటున్నారు.
టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని, తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, ఆయనకే ఓటు వేయాలని చెప్పనున్నారు. దాంతో పాటే.. కెసిఆర్ చెప్పినట్లుగా ఓట్లు, సీట్లతోనే తెలంగాణ వస్తుందని భావిస్తే... తెలంగాణకు కట్టుబడి ఉన్న జాతీయ పార్టీ బిజెపి లోకసభ అభ్యర్థులకు, తెలంగాణపై తీర్మానం తెచ్చే శక్తి ఉన్న టిడిపి అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పాలనే ఆలోచన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications