గాడిదపై జగన్, బాబు చిత్రాల ఊరేగింపు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్నారంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల ఫోటోలను తెలంగాణవాదులు సోమవారం రాత్రి గాడిదల పైన ఊరేగించారు.
ముషీరాబాద్ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రామ్ నగర్‌లో తెలంగాణను అడ్డుకుంటున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో వారు ముగ్గురు నాయకుల ఫోటోలను గాడిదలపై ఊరేగించారు. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లును సీమాంధ్ర తెలుగుదేశం, సీమాంధ్ర కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు చించివేసి దగ్ధం చేయడమేమిటని ప్రశ్నించారు.
ముగ్గురు నేతల చిత్రాల పైన.. 'నాకు సిగ్గు శరం లేదు. నేను తెలంగాణ ద్రోహిని, బిల్లును చించివేసిన వారు గాడిదతో సమానులు, కిరణ్ రెడ్డి, జగన్ రెడ్డి, చంద్రబాబులు తెలంగాణ ద్రోహులు' అని రాశారు. వారికి వ్యతిరేకంగా, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
కాగా, రాష్ట్రపతి నుండి నాలుగు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లు మూడు రోజుల క్రితం అసెంబ్లీకి వచ్చింది. సోమవారం బిల్లును శాసన సభ, శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. దీంతో సీమాంధ్ర నేతలు బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ప్రాంగణంలో చించివేశారు.. దగ్ధం చేశారు. దీనిపై తెలంగాణ నేతలు మండిపడ్డారు.

ఊరేగింపు 1
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడుల ఫోటోలను గాడిదలపై ఉంచిన దృశ్యం.

ఊరేగింపు 2
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడుల ఫోటోలను గాడిదలపై ఉంచి ఊరేగిస్తున్న దృశ్యం.

ఊరేగింపు 3
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడుల ఫోటోలను గాడిదలపై ఉంచిన దృశ్యం.

ఊరేగింపు 4
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడుల ఫోటోలను గాడిదలపై ఉంచిన దృశ్యం. బిల్లును చించివేసిన వారు గాడిదతో సమానులను రాసిన దృశ్యం.












Click it and Unblock the Notifications