జగన్ ప్లాన్: కోస్తాలో చంద్రబాబు గోబ్యాక్?

తెలంగాణలో పాదయాత్ర ముగిసిన తర్వాత కోస్తాంధ్రలో కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. జనవరి 26వ తేదీనాటికి చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం జిల్లాకు చేరుకుంటుంది. ఆ తర్వాత కోస్తాంధ్రలో పాదయాత్రను చేపట్టి రాజమండ్రి వరకు కొనసాగించాలనేది ఆయన ఉద్దేశ్యం. అయితే, దాన్ని అడ్డుకునేందుకు వైయస్ జగన్ నాయకత్వంోలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీలోని కొందరు పథకరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దూకుడును తగ్గించడానికి చంద్రబాబు అనివార్యమైన స్థితిలో తెలంగాణకు కొంత మేరకు అనుకూలంగా వైఖరిని వెల్లడించారని అంటున్నారు. చంద్రబాబు వైఖరి తెలంగాణవాదులను కూడా సంతృప్తిపరచలేకపోయింది. అయితే, ఏదో మేరకు తెలంగాణలో అది ప్లస్ అవుతుందనే విశ్వాసంతో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఉన్నారు. కానీ కోస్తాంధ్రలో ఎదురయ్యే ముప్పును చంద్రబాబు ఊహించలేకపోయారని అంటున్నారు.
కాంగ్రెసులోని కాంగ్రెసుకు చెందిన శైలజానాథ్, గాదె వెంకటరెడ్డి, లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు కూడా చంద్రబాబును కోస్తాంధ్రలో ఎక్కడికక్కడ నిలదీసే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. దాన్ని చంద్రబాబు ఎలా అధిమిగిస్తారో వేచి చూడాల్సిందే...












Click it and Unblock the Notifications