కడపలో ఫ్యామిలీ అదృశ్యం: వీడిన మిస్టరీ, హత్య

ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో పోలీసులు అన్ని వివరాలతో మీడియా సమావేశం పెట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కడప నగర పరిధిలో కుటుంబం అదృశ్యమైన కేసు ఏడాదికి పైగా మిస్టరీగా మారింది. వారికి సంబంధించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నిచోట్ల వెతికినా జాడ తెలియలేదు. తన కుమార్తె, అల్లుడు, వారి పిల్లలు హత్యకు గురై ఉంటారని మృతురాలి తల్లి పలుమార్లు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ నిర్వహించే ఫిర్యాదుల విభాగంలోను ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ జరపగా కొత్త విషయం వెలుగు చూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కనిపించకుండా పోయిన ఆ కుటుంబం అంతా హత్యకు గురైంది.
ఆ హత్య చేసిన కిరాయి వ్యక్తులు విదేశాలకు పారిపోయేందుకు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడంతో.. వారిని అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకోవడంతో వారి హత్య విషయం బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా, మృతి చెందిన వారు కృపాకర్ (భర్త), మౌనిక (భార్య)గా తెలుస్తోంది. వారికి ముగ్గురు పిల్లలు.












Click it and Unblock the Notifications