చిరు 150వ సినిమాపై గవర్నర్ ఆరా, చెర్రీ ఛాన్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 150వ సినిమాపై ఆరా తీశారట. ఎపిసిసి నాయకులతో కలిసి బుధవారం చిరంజీవి వినతి పత్రం ఇచ్చేందుకు రాజ్ భవన్ వెళ్లారు. ఈ సమయంలో గవర్నర్ చిరును 150వ సినిమా పైన ప్రశ్నించారట.
గవర్నర్ తన 150వ సినిమా పైన అడగడంతో చిరంజీవి స్పందిస్తూ... ఆ సన్నాహాల్లో ఉన్నట్లు చెప్పారట. దర్శకులు మణిరత్నం, ఆయన భార్య సుహాసినిలు వచ్చి కలిశారని, కమల్ హాసన్ చేసిన నాయకుడు తరహాలో ఓ పాత్రను పోషిస్తే బాగుంటుందని మణిరత్నం చెప్పారని తెలియజేశారట.

చిరంజీవి నటించనున్న 150వ చిత్రంలో ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, మేనల్లుడు స్టైలిష్ హీరో అల్లు అర్జున్‌లు నటించే అవకాశాలున్నాయని సమాచారం. వారిద్దరు ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు.
కాగా, చిరంజీవి 150వ సినిమా పైన గత కొంతకాలంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి వరకు ఆయన కేంద్రమంత్రిగా బిజీగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి గెలవడంతో చిరంజీవికి ప్రస్తుతానికి విశ్రాంతి దొరికిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో త్వరలో ఆయన 150వ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని భావిస్తున్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications